

జనం న్యూస్ ఏప్రిల్ 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
సాధారణ దుస్తులు ధరించి పోలీసుల పేరు చెప్పి ఎవరైనా వాహనాలు తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ అన్నారు. పోలీసు సిబ్బంది ఎవరు కూడా సివిల్ డ్రెస్ లో వాహనాలు తనిఖీ చేయరు అన్నారు, పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు కాకి యూనిఫామ్ ధరించి వాహనాలు తనిఖీలు చేస్తారని తెలిపారు. సాధారణ డ్రెస్సులో పోలీసులు అంటూ వాహన తనిఖీలు నిర్వహించిన, డబ్బులు, విలువైన వస్తువులు అడిగితే వారు పోలీసులు కాదనే విషయాన్ని గ్రహించి, వెంటనే ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సివిల్ డ్రెస్ లో ఉన్న వారూ వాహనాలను ఆపిన తనిఖీ నిర్వహించిన అప్రమత్తంగా ఉండాలని వెంటనే వారు మోసగాళ్లని తెలుసుకొని ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసులు ఎల్లప్పుడూ యూనిఫామ్ ధరించి రోడ్డుపై వాహన తనిఖీలు నిర్వహిస్తుంటారని వారికి సహకరించాలని సూచించారు.