

హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాజీ మంత్రివర్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
తక్కలపల్లి రవీందర్రావు మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదారి బాలమల్లు నాగుర్ల వెంకన్న
వాసుదేవ రెడ్డి శోభన్ బాబు వై సతీష్ రెడ్డి రాకేష్ రెడ్డి రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి
వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం కిషన్ రావు పరిశీలించారు
జనం న్యూస్ 22 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చింతలపల్లి వద్ద ఈనెల 27న జరగబోయే భారీ బహిరంగ సభ పనులను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మహమ్మద్ అలీ మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్న పదకాలకు పంగనామం పెట్టి కొత్త హామీలకు ఎగనామం పెట్టి ప్రజా పాలన పేరుతో మభ్యపెడుతూ రాష్ట్రాన్ని ఆగం చేస్తుందన్నారు అనంతరం మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సభ కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ నుండి 50 వేల మంది ప్రజలతో సభ ప్రాంగణానికి ఈనెల 27న సాయంత్రం మూడు గంటలకు చేరుకుంటామన్నారు కేసీఆర్ గారు ఒక్కరుగా ఉద్యమ నాయకుడిగా ముందుండి సబ్బండ వర్గాల ప్రజలతో మమేకమై ఉద్యమాన్ని భుజాన ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు అనేకమంది తెలంగాణ కోసం అమరులయ్యారు అని అన్నారు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు అనంతరం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోయింది రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి లాంటి పథకాలు మరుగున పడిపోయాయి ఏది సంపూర్ణంగా అమలు చేయలేకపోతున్నారు మళ్లీ రాబోయేది బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్న ప్రజలు సభకు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేసేందుకు సిద్ధంగ ఉన్నారు కాంగ్రెస్ హామీలు ఇచ్చుడు వరకే కానీ నిలబెట్టుకోవడంలో విఫలమైందని అన్నారు సభా పనులు వేగంగా జరుగుతున్నాయి సభ కోసం వచ్చే కార్యకర్తలకు అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి మండల సీనియర్ నాయకులు తంగేడ మహేందర్ యేల్తూరి స్వామి తంగేడ నగేష్ పోరెడ్డి రవీందర్ రెడ్డి కడారి రాజు గోల్లే మహేందర్ గుండేటి సతీష్ నేత కొమ్మిడి మహిపాల్ రెడ్డి గోడిశాల వినయ్ గౌడ్ జూపాక జడ్సన్ సాతూరి శంకర్ మదార్ గోడిశాల విక్రమ్ గౌడ్ పెండ్యాల సుదర్శన్ దుగ్యాని సమ్మయ్య సాతూరి చంద్రమౌళి వేముల శ్రీనివాస్ కోరే రాజ్ కుమార్ దేవేందర్ రావు బాబురావు డుకిరే రాజేశ్వర్ రావు శివాజీ సతీష్ హింగే రాజేశ్వరరావు హింగే భాస్కర్ అంబాల రాజ్ కుమార్ శ్రీకాంత్ యాదవ్ చిట్టి గౌడ్ ఉట్కూరి కార్తీక్ భగవాన్ గౌడ్ నవీన్ రావ్ వంగ సతీష్ కిరణ్ గౌడ్ కొంగ ప్రవీణ్ డెంగు రమేష్ బొంకురి కార్తీక్ నవీన్ సందెల నరేష్ అనిల్ మురళి తదితరులు పాల్గొన్నారు