Listen to this article

జనం న్యూస్ 16 జనవరి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఒన్ టౌన్ (జర్నలిస్ట్, భీమా కలపాల) న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పేద విద్యార్థిని విద్యార్థులు చేతుల మీదుగా ముఖ్య అతిథులకు శ్రేయోభిలాషులకు దాతలకు సంక్రాంతి ఆతిథ్యం ఇచ్చి పండగ ప్రాముఖ్యత వివరించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రచయిత, నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి యేమినేని వెంకట రమణ పాల్గొన్నారు. ఆయనకు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయవినయ్ కుమార్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమ్మతల్లి రవీంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కరించారు. నగర ప్రముఖులు ప్రజా వైద్యశాల డాక్టర్ శ్రావణ్, జనసేన కార్యకర్త కుర్మారావు భోగి రోజున సంస్థ విద్యార్థిని విద్యార్థులతో జన్మదిన వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. కొంతమంది ప్రముఖులు ఆర్.టి.ఐ మీడియా సభ్యుడు రూపునాథ్, గురు భవాని పోలవరపు దుర్గారావు, రోటరీ క్లబ్ జగన్మోహన్ రావు, సర్వమత సామరస్యాన్ని చాటుతూ సంస్థ తరఫున ముస్లిం సోదరులు ఆధ్వర్యంలో కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు భాష తదితరులు పాల్గొని విద్యార్థినీ విద్యార్థుల ఆతిథ్యాన్ని స్వీకరించి సంస్థ తరఫున సత్కారం అందుకున్నారు. అనంతరం సంస్థ నిర్వహిస్తున్న సేవలను అతిథులు ప్రముఖులు దాతలు ప్రశంసిస్తూ సంస్థకు మరింత సహాయసహకారాలు అందిస్తే ఇంకా ఎన్నో విజయాలను విద్యార్థి విద్యార్థులకు పెద్దలు పట్ల భక్తిశ్రద్ధలు సాంప్రదాయాలను నేర్పిస్తూ వారిని ఉన్నత స్థానాల్లో నిలబత్తే ప్రయత్నం చేస్తున్న సాయి వినయ్ సేవలను వక్తలు కొనియాడారు. ఈ క్రమంలో విద్యార్థులు కూడా చదువుల పట్ల ఆకర్షలే చెడు అలవాట్లకు దూరంగా ఉండటం గర్వకారణంగా ఉందని వినయ్ అన్నారు.ఈ సంస్థ సేవలను అధికార ప్రతినిధులు అధికారులు గుర్తించి వారికి సరైన సహాయ సహకారాలు గుర్తింపు అందించేలా చేకూరాలని ప్రస్తుతం సంస్థ నిర్వాహన సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ చిరు ఉద్యోగి అవటంతో ఆర్థిక ఇబ్బందులతో నిర్వహణకష్ట కాలంగా మారిందని,అందరు కూడా కలిసి ముందుకు వచ్చి మన వంతు సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల, గోవింద్, అయ్యప్ప, బుజ్జి, అజయ్, నిఖిల్, చైతన్య, రాము, సంస్థ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.