

జనం న్యూస్ ఏప్రిల్ 22 (నడిగూడెం)
ఈనెల 27న టిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా మండల కేంద్రంలో గల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రజతోత్సవ సభ కరపత్ర ఆవిష్కరణ బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్ మాట్లాడుతూ వరంగల్ లో ఈ నెల 27న జరిగే రజితోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లేని ఆటకెక్కించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లం శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్,మేకల గంగరాజు, దున్న సుధాకర్, గుండు శ్రీను, తంగేళ్ల లింగయ్య, మౌలానా, ఎస్కే జలీల్, షేక్ గౌస్, ఉద్యమ నాయకులు దున్న ప్రవీణ్, ఎండి రఫీ, జాకీరు హుస్సేన్, అమరబోయిన సైదారావు, నక్క సైదులు, దున్న రవి, గుంజ వీరబాబు, నక్క రమేష్, తదితరులు పాల్గొన్నారు.