Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో


తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల కళాశాల (బాలుర) ఆసిఫాబాద్ సత్తా చాటిన విద్యార్థులు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎస్ . భీమ్ రావు 946 ,బైపిసి విభాగంలో బి రాజేష్ 829, ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో పి . సిద్ధార్థ 452, బైపీసీ విభాగంలో సిహెచ్ .అజయ్ 411. మార్కులు సాధించి కళాశాల టాపర్లుగా నిలిచారు. మొదటి సంవత్సరంలో 91 శాతం ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ B శ్వేత తెలిపారు. అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.