

గుడివాడ అఖిల్ -584 మొదటి స్థానం
షేక్ ఆరోధ్య బేగం-578 రెండువ స్థానం
నౌడు సాయి రుత్విన్-575 మూడువ స్థానం
జనం న్యూస్ 24 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
మెంటాడ మండలం లో ఉన్న హై స్కూల్ విద్యార్థులు పది ఫలితాలలో సత్తా చాటారు. బుధవారం వెలువడిన పది ఫలితాలలో హై స్కూల్ విద్యార్థులు గుడివాడ అఖిల్ 584, షేక్ ఆరోధ్య బేగం578 నౌడు సాయి రుత్విన్575, ఉత్తమ మార్కులు సాధించి మండల ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి మండల టాపర్లుగా నిలిచినట్లు డిప్యూటీ డీఈవో కె. మోహన్ రావు ఎంఈఓ -2యు.వి.యస్ శివాజీ వర్మ పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలకు చల్లపేట హైస్కూల్ నిదర్శనం అన్నారు. ముగ్గురు విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలవడం చాల సంతోషంగా ఉందన్నది అన్నారు. ప్రతి సంవత్సరం కూడా మండల లో హైస్కూల్ విద్యార్థులు అత్యధిక మార్పులు సాధించి మండల టాపరులుగా నిలవడం గర్వంగా ఉందన్నారు. మొత్తంగా 424మంది విద్యార్థులు పరీక్షలు రాయగ 63 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. మెంటాడ మండలం హై స్కూల్ 85% ఉత్తీర్ణత సాధించినట్లు వారు పేర్కొన్నారు. టీచర్లు నాణ్యమైన విద్య బోధన, తల్లిదండ్రులు ప్రోత్సాహంతో ఈ ఫలితాలు సాధించామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని రెడ్డి యోగితస్రికి 558 మార్కులు, జి.టి.పేట జడ్పీ హైస్కూల్ విద్యార్థిని వి.తనూజ కి 549 మార్కులు, కస్తూరిబా పాఠశాల విద్యార్థిని యు.నీలిమకి 505 మార్కులు, మేడిపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని బి.రేష్మకి 544 మార్కులు సాధించి ఆయా హై స్కూల్ లలో టాపర్లుగా నిలిచారు. అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు అభినందించారు.వచ్చేసంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు కొసం మామండల విద్యాశాఖ కృషి కొనసాగుతుంది అని అన్నారు.