Listen to this article

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్…

జనం న్యూస్ 24 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వైయస్సార్ నగర్ కు వెళ్ళే దారిలో ఉన్న నగరపాలక ఆధ్వర్యంలో ఉన్న శ్మశాన వాటిక అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు.బుధవారం ఉదయం స్థానిక వైఎస్సార్ నగర్ కాలనీకి వెళ్ళే దారిలో ఉన్న నగరపాలక శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో మౌళిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని, ఎలక్ట్రికల్ బర్నింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని, కుమ్మరి వీధి జంక్షన్ నుంచి వైయస్సార్ నగర్ కాలనీకి వెళ్ళే రోడ్డు నిర్మాణం చేయాలని, విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేయాలని, రైల్వే ఖానా క్రింద వర్షపు నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని విజయనగరం పట్టణ సమస్యల పై సిపిఐ సమర భేరి కార్యక్రమంలో భాగంగా డిమాండ్ డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య గార్కి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ విజయనగరం మున్సిపాలిటీగా ఏర్పడి నాటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయిన వరకు ఎన్నో పాలకవర్గాలు మారుతున్నాయి మున్సిపల్ అధికారులు మారుతున్న కానీ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం, వైయస్సార్ నగర్ కాలనీకి వెళ్ళే రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయింపులు జరుగుతున్నాయి కానీ ఆరంభ శూరత్వంలా పనులు ప్రారంభం చేయడం మద్యలో అభివృద్ధి పనులు ఆపేయడం జరుగుతూనే ఉన్నది అని విమర్శించారు. విజయనగరంలో పాలకవర్గాలు రాజకీయాలు చేస్తూ ఒక పార్టీ పాలకవర్గం మొదలు పెట్టి మద్యలో వదిలేసిన పనులు మరొక పార్టీ పాలకవర్గం ముట్టుకోరు మళ్ళీ వాళ్ళు కొత్త కాంట్రాక్టర్లుకి టెండర్లు పిలిచుకునే నీచమైన ఆనవాయితీ దశాబ్దాల కాలంగా విజయనగరానికే దాపురించింది అని అశోక్ దుయ్యబట్టారు. ఈ మద్యలో కేటాయించిన నిధులు మాయమైపోతున్నాయని విమర్శించారు. అందుకే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అయిన తరువాత కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ నగర్ కాలనీకి వెళ్ళే దారిలో ఉన్న శ్మశాన వాటికను అభివృద్ధి చేయకపోవడం వలన లోపల చెట్లు, తుప్పలు విపరీతంగా పెరిగిపోయాయి అని అన్నారు. శ్మశాన చుట్టూ ఉన్న స్థలం కూడా దురాక్రమణకు గురవుతుందని తెలిపారు. మృతదేహాలను పూడ్చడానికి వచ్చేవారు వారం రోజుల క్రితం పూడ్చిన చోటే మళ్ళీ గుంతలు త్రవ్వడం వలన కుళ్లిపోయిన కళేబరాలు, ఎముకల ఎముకల గూళ్ళు బయటపడటంతో ప్రజలు భయాoదోళనకు గురవుతున్నారని తెలిపారు. అందులో ఎలక్ట్రికల్ బర్నింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయింపులు జరిగిన నిర్మాణం పనులు చేపట్టి మద్యలో ఆపేయడం వలన ఇంతవరకు నిర్మించిన నిర్మణాలు మరల శిథిలావస్థకు చేరుకున్నాయి అని తెలిపారు. పక్కనే ఉన్న రోటరీ క్లబ్ సంస్థ శ్మశాన వాటికలో భారీ ఖర్చుతో కూడుకున్న దహన సంస్కారాలు చేయడానికి ఆర్థిక స్తోమత లేని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు పురపాలక శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయాలనుకున్న ఇందులో పరిసరాలు చాల దారుణంగా ఉండటం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) స్థానిక సమస్యల పై సమర భేరి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనీ తెలిపారు. ఈ నేపథ్యంలో పురపాలక నిధులతో శ్మశాన వాటికను అవసరమైన అన్ని రకాల మౌళిక వసతులతో అభివృద్ధి చేయాలని, ఎలక్ట్రికల్ బర్నింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని, వైయస్సార్ నగర్ కాలనీకి వెళ్ళే రోడ్డు నిర్మాణం చేయాలని, విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేయాలనీ, రైల్వే ఖానా క్రింద వర్షపు నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా పెట్టీ చర్చించి పరిష్కారం కోసం తీర్మాణం చేసి నిధులు కేటాయించాలని బుగత అశోక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కస్పా శాఖ కార్యదర్శి ఎస్.రంగరాజు, మార్క్స్ నగర్ శాఖ సహాయ కార్యదర్శి బూర వాసు తదితరులు హజరయ్యారు.