

జనం న్యూస్ – ఏప్రిల్ 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లో నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ రమేష్ జి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు,మంగళవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ లో హిందూ టూరిస్టులపై ముష్కరుల దాడి చేసి 27 మందిని చంపినందుకు నిరసనగా పార్టీలకతీతంగా ఉగ్రవాదుల దిష్టిబొమ్మ ను దహనం చేశారు నందికొండ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మాజీ కౌన్సిలర్ హిరేకర్ రమేష్ జి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు, వర్తక సంఘం నాయకులు మంచికంటి కిషోర్, నజీర్ (ఎలక్ట్రికల్), బిజెపి పార్టీ టౌన్ అధ్యక్షుడు గణేష్ తంగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్, మున్నా ( స్వీట్స్ ), పగిడిమర్రి యోహాను, రామస్వామి, స్వతంత్ర రావు, సత్యనారాయణ, మంజుల జనార్ధన్, గాజుల రాము, ఆత్మకూరు రమణయ్య, వల్లపు నాగార్జున ,ఆలేటి గురవయ్య, వేమవరపు రాములు తదితరులు పాల్గొన్నారు.