

కెవిపిఎస్ నిర్వహిస్తున్న జనజాతరను విజయవంతం చేయండి దోoతాల నాగార్జున, ముదిగొండ వెంకటేశ్వర్లు
జనం న్యూస్ – ఏప్రిల్ 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే జన జాతరను జయప్రదం చేయాలని పెదవుర మండల కేంద్రంలో కేవీపీఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు దొంతల నాగార్జున మరియు ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నల్లగొండలో జరిగే జన జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కాసిం ,బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, గాయకులు అంబటి నాగన్న, ప్రొఫెసర్ అనిత పాల్గొంటారని కావున , మహనీయుల జన జాతరకు నల్లగొండ జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు దోరేపల్లి మల్లయ్య, అంజయ్య, లింగయ్య, రాజు, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.