

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
పహాల్గంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వెంకట బుల్లోడు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో కిరాతకంగా, పాశవికంగా అమాయక పర్యాటకులకు పై జరిగిన ఉగ్రదాడి కుట్రపూరితంగా జరిగిన దాడిగా దీనిని పరిగణించాలని.ఈ దాడిలో సుమారుగా 27 మంది చనిపోయారని చాలామంది తీవ్రంగా గాయాలు పాలయ్యారని. చాలామంది మృత్యువుతో పోరాడుతున్నారని,ఈ దాడి చేసిన వారిని,వారి వెనక ఉన్న కుట్రదారులను ఎవరిని కూడా ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టకూడదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలను ఆదుకొని న్యాయం చేయాలని తెలియజేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ ముందుకు వచ్చి భారత దేశానికి అండగా నిలవాలని, ఇలాంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమయంలో భారతదేశానికి మద్దతుగా నిలిచి ఏ విధమైన సహాయం కావాలన్న అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మద్దతు ప్రకటించిన అమెరికాకు,రష్యాకు ధన్యవాదాలు తెలియజేశారు.ఉగ్రవాదంపై కఠినమైన నిర్ణయాలతో పూర్తిగా అణిచివేసే దిశగా అడుగులు వేయాలని,ప్రభుత్వాలు మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు సన్నద్ధంగా,అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ ఈ ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్యని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. ఈ దాడిలో చనిపోయిన అమాయక ప్రజలకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సానుభూతిని తెలియజేశారు