Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా ఈ రోజు నుండి నెల చివరి వరకు మార్కుక్ మండలం లోని మూడు పాఠశాల లో సమ్మర్ క్యాంపు లు చాలా అట్టహాసముగా, ప్రభుత్వ బడుల లో ఎన్రోల్మెంట్ పెంచడం, సమయము, సద్వినియోగం, విద్యార్థుల నైపుణ్యం పెంపొందించడం లక్ష్యం గా ప్రారంభం కాబడినవి. ఇందులో ప్రాథమిక్కొన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ లో, ప్రాథమిక పాఠశాల చెబిర్తి, ప్రాథమిక పాఠశాల పాతూర్ లో ప్రారంభించబడినవి.
ఈ క్యాంపు ల వల్ల 350 మంది విద్యార్థుల కు డ్రాయింగ్ స్కిల్స్, కరాటే శిక్షణ, స్టోరీ టెల్లింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, తదితర అంశాలు పై శిక్షణ పొందుతారు.ఇట్టి కార్యక్రమం లో మండల విద్యాధికారి, వెంకటరాములు,పాల్గొని పిల్లలు, తల్లిదండ్రులు ఇట్టి కార్యక్రమం సద్వినియోగం చేసుకొనుటకు సూచించారు. ప్రధానోపాధ్యాయులు నర్సింలు, దయాకర్ రావు, బాలకృష్ణ, ఉపధ్యయీని, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు