Listen to this article

జనం న్యూస్ ;24 ఏప్రిల్ గురువారం; సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి: వై. రమేష్ ;

పరీక్షల సమయాల్లో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, వారిలో నమ్మకం పెంచేందుకు ప్రత్యేకంగా ఒక అవగాహన సదస్సు సిద్ధిపేటలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగింది .ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. సైకాలజిస్టు ఉమాపతి ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా హాజరై, విద్యార్థులకు ఒత్తిడి నిర్వహణ, పరీక్ష భయం, సెల్ఫ్ మోటివేషన్, మరియు ధైర్యం పెంపొందించుకునే పలు అంశాలపై చక్కటి దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని, ప్రశ్నలు అడిగి, సమాధానాల ద్వారా తమ సందేహాలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య నగర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.