

జనం న్యూస్ ఏప్రిల్ 24 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా
బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన టి యు సౌత్ క్యాంపస్ లో గెస్ట్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్న
డాక్టర్ సంతోష్ గౌడ్, ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై ఢిల్లీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మేధావులు పరిశోధక విద్యార్థులు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సదస్సులో తెలంగాణ నుంచి ఎంపిక చేసిన పదిమందిలో ఒకరు డాక్టర్ సంతోష్ గౌడ్, బుధవారం పాల్గొన్నారు. అనంతరం గ్రామీణ స్థాయిలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మన్సుక్ మాండవియా, ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్ సింగ్, సునీల్ బన్సల్, తదితరులు పాల్గొన్నారు.