

జనంన్యూస్. 24 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి
భీమారం మండల కేంద్రంలోని ఆరేపల్లి ఎక్స్ రోడ్ నుండి మద్యం షాపు వరకు రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ పొదలు. చెట్లు . చెరువు చూడడానికి కొంచెం భయంకరంగానే ఉంటాయి. మరియు రోడ్డుపై గుంతలు. రెండు వాహనాలు ఎదురుపడితే ఇంకా ఎన్నో ఇబ్బందులు అసలు రోడ్డు వెడల్పే ఉండదు. సాయంత్రం రోడ్డు పక్కనే మద్యం ప్రియులు ఇలాంటి ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకుంది స్థానిక మండల నాయకులు దీనిపై శ్రద్ధ తీసుకొని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకుపోయి ముళ్ళ పొదలు తొలగించి రోడ్డు గుంతలు పూడ్చేసి. ప్రమాద సూచిక ఏర్పాటు చేయాలని. కోరుతున్నారు. ఇలాంటివి గ్రామాలలో ఎక్కువ కనబడుతున్నాయి ఉపాధి హామీలో కూడా రోడ్డును బాగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. స్థానిక మండల అధికారులు కూడా దీని మీద దృష్టి సారిస్తే బాగుంటుందని సాయంత్రం టైములో ఈ రోడ్డుపైన పోలీసులు పెట్రోలింగ్ చేస్తే కూడా ఆకతాయిలకు అడ్డుకట్ట వేసినట్టుగా ఉంటుందని ప్రజలు ఆరోపించారు