

అదనపు కోర్ట్ ఏర్పాటు కోసం జిల్లా జడ్జి వినతి పత్రం..
హుజురాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణ్ కుమార్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )
నూతన బాధ్యతలు స్వీకరించిన జిల్లా జడ్జి ఎస్ శివకుమార్ ని హుజరాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ మరియు మెంబర్స్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానిచ్చారు.ఇ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా జడ్జి గా నూతన బాధ్యతలు స్వీకరించిన శివకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఘన సన్మానం చేయడం జరిగింది అని తెలిపారు.హుజూరాబాద్ కోర్టులో ఉన్నటువంటి వివిధ సమస్యలపై జిల్లా జడ్జి కి వివరించడం జరిగింది అని అన్నారు. స్థానికంగా జిల్లా అదనపు కోర్టును ఏర్పాటు చేయవలసిందిగా వినతి పత్రాన్ని అందజేసమని తెలిపారు. హుజురాబాద్ కోర్టులో ఉన్నటువంటి వివిధ సమస్యలను జిల్లా జడ్జి దృష్టికి తీసుకువెళ్లి, హుజరాబాద్ కోర్టుకు రావలసిందిగా ఆహ్వానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ తో పాటు, ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రమేష్, ఉపాధ్యక్షులు నూతల శ్రీనివాస్, ఉప ప్రధాన కార్యదర్శి పిట్టల రాజేష్, లైబ్రరీ సెక్రెటరీ చౌడమల్ల భాను కిరణ్, మాజీ అధ్యక్షులు అందే వెంకటేశ్వరరావు, నల్ల భూమిరెడ్డి మరియు న్యాయవాదులు కంకణాల అమరేందర్ రెడ్డి, వంశీ మరియు హరిహరన్ పాల్గొన్నారు.
