

జనం న్యూస్ – ఏప్రిల్ 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 2వ వార్డులో క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతుల కార్యక్రమం నిర్వహించారు,నందికొండ మున్సిపాలిటీ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరితో వదిలివేసిన రోడ్లను మొరంపోసి వాహనాలు వెళ్లడానికి అనువుగా శ్రమదానం చేసిన క్రాంతి యువజన సంఘం సభ్యులు, స్థానిక రెండవ వార్డులో సిసి రోడ్లు వేసి కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణితో రోడ్డును కలపకుండా వదిలేయడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బంది పడటం గమనించి క్రాంతి యువజన సంఘం సభ్యులు తమ సొంత నిధులతో మొరం పోయించి గుంతలు పూడ్చి రోడ్డు మరమ్మత్తు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్రాంతి యువజన సంఘం అధ్యక్షులు శివ, సభ్యులు రాము, సుబ్బయ్య, సైదులు, జగన్ తదితరులు పాల్గొన్నారు.