

జనం న్యూస్ ఏప్రిల్ 25 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)గోరంట్ల మేజర్ పంచాయతీ :రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాలు మేరకు 4వ వార్డ్ లో స్థానిక టీడీపీ నాయకులు వార్డ్ లో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు తెలుసుకొని పంచాయతి సర్పంచ్ సరోజ నాగేనాయక్ దృష్టి కి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన సర్పంచ్ సరోజ నాగే నాయక్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి 4 వార్డు లో పర్యటించి వాటిని పరిశీలించారు రేపటి నుండి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ సరోజ నాగేనాయక్ , మాజీ కో అప్షన్ మెంబెర్ అజుముతుల్లా, మాజీ డీలర్ వృషభ దేవుడు, చాంద్ బాషా, మాభాష, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గున్నారు.