

జనం న్యూస్, ఏప్రిల్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
ఈ నెల 27వ వరంగల్ లో నిర్వహించే బీఆర్ఏస్ రజతోత్సవ బహిరంగ సభను జయ ప్రదం చేయాలని, విద్యార్థి, యువజన విభాగం, గౌడ్ సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,శ్రీ నుతన గౌడ సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండుకాడి వెంకటేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.వరంగల్ లో నిర్వహించే సభకి విద్యార్థి. యువజన విభాగం, గౌడ సంఘం నాయకులు, అన్ని రంగాల నాయకులు, నేతలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలన తెలంగాణ రాష్ట్రా నికి శాపంగా మారిందని ఆయన విమ ర్శించారు. ప్రజలకు, విద్యార్థులకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.