Listen to this article

జనం న్యూస్ 25.ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనురు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంబ్లె బాబాసాహెబ్ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు శుక్రవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 29న జైనురు లోని మార్కెట్ యార్డులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలకు తప్పక రావాలని ఆ సంఘం నాయకులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కొవ లక్ష్మి ని కలిసి ఆహ్వాన పత్రం అందించారు. ఇందుకు గాను తప్పకుండా జయంతి వేడుకలకు హాజరవుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు ఆ సంఘం అధ్యక్షులు కాంబ్లె బాబాసాహెబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కాంబ్లె అన్నారావు, సోన్ కాంబ్లె సిద్దు, భూతలే కిరణ్ తదితరులు ఉన్నారు.