Listen to this article

జనం న్యూస్- ఏప్రిల్ 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండించిన మజీద్ కమిటీ సభ్యులు మరియు ముస్లిం మైనారిటీ సభ్యులు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ అల్లాను ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు, పవిత్ర శుక్రవారం నమాజ్ తదనంతరం హిల్ కాలనీ మజీద్ నందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు మరియు ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ షబ్బీర్, ఉపాధ్యక్షులు ఎస్కె గౌస్, ముస్లిం మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు.