

.భారీ సంఖ్యలో తరలిరావాలని రాజా రమేష్ జనం న్యూస్ 25 భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి భీమారం మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ గోడ ప్రతులను విడుదల చేయడం జరిగింది. ఈనెల27 ఆదివారం రోజున వరంగల్ లోని ఎల్కతూర్తిలో జరుగబోయే బిఆర్ ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా రజతోత్సవ సభ గోడ ప్రతులను చెన్నూర్ మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్కసుమన్ ఆదేశాలమేరకు భీమారం మండలకేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు కలగూర రాజకుమార్ అధ్యక్షతన నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ రాజారమేష్ చేతుల మీదుగా విడుదల చేశారు.అనంతరం సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో,చెన్నూరు నియోజకవర్గ మాజీ యూత్ అధ్యక్షులు వేముల శ్రీకాంత్ గౌడ్, భీమారం మండల మాజీ అధ్యక్షులు పోటు రాజేశ్వర్ రెడ్డి, చెన్నూరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ భూక్యా రాజకుమార్ నాయక్,సుంకరి గోపాల్,దాసరి మనిధీప్,మాజీ వార్డు మెంబర్ గుడిమల్ల నరహరి,మాజీ వార్డు మెంబర్ వేముల ప్రణీత్ గౌడ్,వడ్లకొండ పవన్,చెవుల నరేష్, బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వీరగోని రమేష్ గౌడ్, దుర్గం లాజర్,నవీన్, జనంపల్లి సమ్మయ్య , ఆత్కూరి రాము, దాసరి చంద్ర మౌళి, తదితరులు పాల్గొన్నారు.