Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )భద్రాచల రామయ్య కల్యానానికి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు 250కిలోల గోటి తలంబ్రాలు అందించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజుకు తిరిగి 100కిలోల ముత్యాల తలంబ్రాలు బహుకరించగా శుక్రవారం నాడు స్థానిక సరస్వతీ శిశు మందిర్ లో అడిషనల్ సివిల్ జడ్జి ప్రియాంక, ముఖ్య అతిథిగా హాజరై స్వాగతం పలికారు.అనంతరం జడ్జి ప్రియాంక మాట్లాడుతూ భద్రాచల దేవస్థానం రామకోటి రామరాజు భక్తికి మెచ్చి 100కిలోల ముత్యాల తలంబ్రాలు అందించడం దాని వెనక నిరంతర కృషి పట్టుదల ఎంతో ఉందన్నారు. సీతారాముల కల్యానానికి లక్షల మంది 250కిలోల గోటి తలంబ్రాలు అందించడం. వారందరికీ తిరిగి 100కిలోల తలంబ్రాలు తీసుకొచ్చి గ్రామ, గ్రామన పంపిణికి రామకోటి రామరాజు శ్రీకారం చుట్టడం అయన రామభక్తి అమోఘం అని శాలువాకప్పి భగవతద్గీత పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. మమ్మల్ని కూడా భాగస్వాములను చేయడం సంతోషంగా ఉండన్నారు.సామజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ రాముని కోసమే తన జీవితం అంకితం చేసిన రామకోటి రామరాజు ధన్యుడన్నారు. 100కిలోల భద్రాచల తలంబ్రాలు మన గ్రామానికి తీసుకురావడం అనంతరం తెలంగాణ అంతట పంపిణి చేయడం అభినందనీయం అన్నారు.సరస్వతీ శిశు మందిర్ ప్రిన్సిపల్ కొరిడే హరినాపవన్ మాట్లాడుతూ గోటి తలంబ్రాల్లో మమ్మల్ని బాగా స్వాములను చేయడం, మళ్ళీ మాకు ముత్యాల తలంబ్రాలు అందించడం అపర రామ భక్తునిగా పేరు పొందిన రామకోటి రామరాజుకే సాధ్యం అన్నారు.