Listen to this article

వారసత్వ భూముల పట్టా మార్పిడికి క్షేత్ర స్థాయి విచారణ….

జనం న్యూస్ ఏప్రిల్ 25 నడిగూడెం భూ సమస్య ల పరిష్కారం కొరకు రైతులకి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొల్లు కోటయ్య పంక్షన్ హాల్ లో నిర్వహించిన భూ భారతి చట్టం -2025 అవగాహన సదస్సు ను జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ధరణిలోని వైఫల్యాలను గుర్తించి ఎలా పరిష్కారం చేయాలో తెలంగాణ ప్రభుత్వం అలోచించి ముఖ్యమంత్రి ధరణి పై కమిటీ వేసి 18 రాష్ట్రాలలో పరిశీలించి నిపుణులు, రిటైర్డ్ రెవిన్యూ అధికారులు, మేధావులు, సలహాలు సూచనలు తీసుకొని ముసాయిదాను తయారు చేపించి పబ్లిక్ డోమైన్ లో పెట్టి ప్రజల నుండి అభిప్రాయాలు, సూచనలు సేకరించి అద్భుతమైన భూ భారతి చట్టం రూపొoధించి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రియల్ 14 రోజున భూ భారతి చట్టం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించి 4 మండలాలో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందని, తదుపరి జిల్లాకి ఒక్క మండలం లో అమలు చేసి ఇంకా ఏమైనా సమస్యలు పరిష్కరించలేనివి ఉన్నాయో గుర్తించి భూ భారతి పోర్టల్ లో తగు మార్పులు చేసి తర్వాత జూన్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అమలు చేయటం జరుగుతుందని తెలిపారు.గతంలో గ్రామ స్థాయి లో భూ సమస్యలను పరిష్కరించేందుకు వి ఆర్ ఓ, వి ఆర్ ఎ లు ఉండే వారని ధరణి చట్టం అమలులోనికి వచ్చిన తర్వాత వి ఆర్ ఓ వ్యవస్థ రద్దు కావటం తో ఆ రోజు నుండి నాలుగున్నర సంవత్సరాలుగా రైతులు భూ సమస్యలకి ఎవరికీ చెప్పాలో తెలియక తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరిగితే మా దగ్గర అధికారాలు లేవని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేవారని, మారుమూల ప్రాంతం నుండి జిల్లాకి రావాలంటే చాలా ఇబ్బంది పడ్డారని తెలియజేశారు. భూ భారతి చట్టం అమలులోకి రాగానే వెంటనే భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు రూల్స్ తయారు చేసారని రెవిన్యూ వ్యవస్థ బలపర్చేందుకు అధికారాలు వికేంద్రికరణ చేస్తూ ప్రతి గ్రామానికి గ్రామ పాలనాధికారులను నియమించటం జరుగుతుందని తెలిపారు.పాత పాస్ పుస్తకం లో భూమి ఉన్నవారికి, విస్తీర్ణం మొత్తం నమోదు కానీ వారు భూ భారతి ద్వారా సమస్యలు పరిష్కారం అయి వారి పేర్లు రికార్డులలో నమోదు చేసి పాస్ పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు.రైతులు వ్యవసాయం గురించి ఆలోచించాలి కానీ భూమి హక్కులు గురించి ఆలోచించ కూడదు అని ప్రభుత్వం అన్ని భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టం రూపకల్పన చేసారని తెలిపారు.ఈ సందర్బంగా కలెక్టర్ భూ భారతి రైతులకి వరం లాంటిది అని పేర్కొన్నారు.
ఒక తెల్ల కాగితం ద్వారా పెద్ద మనుషుల మధ్య కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధికరణ చేయుటకి సాదాబైనామా ద్వారా 2020 లో దరఖాస్తులు స్వీకరించారు కానీ ధరణి చట్టం వల్ల అమలు కాలేదు.ఇప్పుడు భూ భారతి ద్వారా సాదాబైనామా ధరఖాస్తులు ఆర్డీఓ క్షేత్ర స్థాయి లో పరిశీలించి న్యాయమైన వాటిని క్రమబద్దికరించి పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేస్తారని తెలిపారు.ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా అసైన్మెంట్ కమిటీలు వేసి రక్షించటం జరుగుతుందని తెలిపారు.ధరణిలో ఒకరి భూమిపై కోర్ట్ కేసు ఉంటే ఆ సర్వే నెంబర్ అంత నిషేధిత జాబితాలో బ్లాక్ చేయటం జరిగిందని భూ భారతి లో మాత్రం కోర్ట్ వివాదం ఉన్న భూమి మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచటం జరుగుతుందని తెలిపారు.వారసత్వం భూములు పట్టా మార్పిడి చేసేటప్పుడు కొంత మంది వారసులు మాత్రమే వచ్చి భూమిని పట్టా చేపించుకునే వాళ్లు అని, తర్వాత మిగిలిన వారసులు వచ్చి మాకు తెలీయకుండా కొంతమంది మాత్రమే పట్టా చేపించుకున్నారని పిర్యాదు చేస్తే మా పరిధిలో లేదు కోర్ట్ ద్వారా పరిష్కరించుకోవాలని తహసీల్దార్ లు చెప్పేవారు అని, కానీ భూ భారతి ద్వారా తహసీల్దార్ వద్ద ఏమైనా తప్పు జరిగితే ఆర్డీఓ కి, ఆర్డీఓ వద్ద తప్పు జరిగితే కలెక్టర్ కి అప్పీల్ చేసేలా రెండు అంచేలా అప్పీల్ వ్యవస్థను భూ భారతిలో పొందుపర్చారని అన్నారు. రైతులకి పాస్ బుక్స్ ఉంటేనే సంతోషం అని భూ భారతి అమలు తర్వాత రెవిన్యూ బృందాలు గ్రామాల వారీగా భూ సమస్యలు పరిశీలించి రైతులకి మేలు జరిగేలా పాస్ పుస్తకాలు జారీ చేయటం జరుగుతుందని తెలి పారు.సమావేశం కి వచ్చిన ప్రతి ఒక్కరు భూ భారతి చట్టం గురించి తెలియని ప్రజలకి చెప్పాలని సూచించారు.
తదుపరి అదనపు కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి భూ సమస్యలు పరిష్కరించేందుకు సరళంగా, సులభంగా అర్ధం అయ్యేలా భూ భారతి చట్టం రూపొందించటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ధరణి అమలు తర్వాత వి ఆర్ ఓ, వి ఆర్ ఎ లు రద్దు కావటం, తహసీల్దార్ లకి అధికారాలు లేకపోవటంతో చిన్న చిన్న సమస్యలు ఎవరికీ చెప్పాలో తెలియక రైతులు చాలా ఇబ్బంది పడ్డారని , ప్రతి చిన్న సమస్యకి సూర్యాపేట వచ్చి పిర్యాదు చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. త్వరలో రెవిన్యూ వ్యవస్థ బలపర్చేందుకు జిల్లాలో 279 మంది గ్రామపాలనాధికారులు రాబోతున్నారని సమస్యలు గ్రామ స్థాయి లోనే పరిష్కరించటం జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయగానే సర్వే మ్యాప్ ని పాస్ పుస్తకంలో ప్రింట్ ఇస్తారని అన్నారు. భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కరించేలా జూనియర్ అసిస్టెంట్ నుండి కలెక్టర్ వరకు రాష్ట్ర స్థాయి లో, జిల్లా స్థాయి లో శిక్షణ నిర్వహించడం జరిగిందని తెలిపారు.తదుపరి కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ పిపిటి ద్వారా భూ భారతి చట్టంను రైతులకి క్లుప్తంగా సెక్షన్ ల వారీగా వివరించారు.నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.నీలం శైలజ భర్త లింగయ్య ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి పునాది పూర్తి అవ్వగానే లక్ష రూపాయలు అకౌంట్ లో జమ అయ్యాయా అని అడగగా లక్ష రూపాయలు వచ్చాయని సంతోషంగా కలెక్టర్ కి తెలిపారు.ఈ కార్యక్రమం లో ఆర్డీఓ సూర్యనారాయణ, మండల స్పెషల్ అధికారి సతీష్ కుమార్, తహసీల్దార్ సరిత,ఎంపిడిఓ సంజీవయ్య,మార్కెటింగ్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ,ఎడిఎ యల్లయ్య,పిఎసి ఎస్ చైర్మన్లు కొల్లు రామారావు, రాజేష్, ,పంచాయతీ కార్యదర్శిలు ఉమరాణి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.