Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : తేదిః 25-04-2025 నాడు పెద్దపల్లి జిల్లా యందు ప్రపంచ మలేరియా దినోత్సవములో బాగంగా మలేరియా అవగాహాన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ జి. అన్నా ప్రసన్న కుమారి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, పెద్దపల్లి ఈ కార్యక్రమమును ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా ఆసుపత్రి నుండి అయ్యప్ప టెంపుల్ కూడలిలో మానవహారం నిర్వహించి మలేరియా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నినాదాలు చేయడం జరిగినది.ఈ సంధర్బంగా డాక్టర్ జి. అన్నా ప్రసన్న కుమారి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ 2030 వరకు మలేరియాను నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యం, కాపున వివిధ ప్రభుత్వ శాఖలను మరియు ప్రజలను భాగసౌమ్యం చేస్తూ వివిధ కార్యాక్రమముల ద్వారా ప్రజలలో మలేరియా వ్యాధిని ఆరికట్టుటకు, దోమల నిర్మూలనకు అవగాహాన కల్పిస్తూ ఈ కార్యక్రమమును ముందుకు తీసుకేళ్తున్నామని అన్నారు. ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయితి సిబ్బంది సమిష్టిగా ప్రజలు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో డ్రైడే పాటించునట్లు చేయాలి అని అన్నారు. దోమలు గుడ్లు పెట్టకుండ ఇంటి పరిసరాలలో నీరు నిల్వకుండా చూడాలని, నీటి పాత్రలు, ట్యాంక్ లను మూసి వుంచాలి అని అన్నారు. వ్యక్తిగతంగా కూడా దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పగిలిన డ్రమ్ములు, కొబ్బరి చిప్పలు, సీసాలు, కూలర్లలలో నీరు నిల్వ వున్న దోమలు గ్రుడ్లు పెట్టును. కావున వాటిని తోలగించాలని అన్నారు. చలితో కూడిన జ్వరము వచ్చిన యెడల దగ్గరలోనున్న ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్ లలో రక్త పరీక్ష చేయించుకోవాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమములో డాక్టర్ బి. శ్రీరాములు, ప్రోగ్రాం అధికారి, డాక్టర్ వి. వాణిశ్రీ, ప్రోగ్రాం అధికారి, డాక్టర్ కె.వి. సుధాకర్ రెడ్డి, ప్రోగ్రాం అధికారి, డాక్టర్ బి. కిరణ్ కుమార్, ప్రోగ్రాం అధికారి, శ్రీ కె. ఉమామహేశ్వర్, సి.హెచ్.ఒ., శ్రీ కె. రమేష్, డి.పి.ఎమ్.ఒ., శ్రీ టి. రాజేశం, యం.పి.హెచ్.ఇ.ఒ., శ్రీ పి. రవీందర్, శ్రీ బి. అంజయ్య, సబ్ యూనిట్ అధికారులు, శ్రీ సి.హెచ్. శ్రీనివాస్, ఆరోగ్య పర్యవేక్షకులు, రాఘవాపూర్ మరియు రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆరోగ్య పర్యవేక్షకులు, యం.పి.హెచ్.ఎ (ఫిమేల్), (మేల్), ఆశ కార్యకర్తలు పాల్గోన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి పెద్దపల్లి.