

జనం న్యూస్, ఏప్రిల్ 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : రామగిరి మండలం నవాబ్ పేటకు చెందిన మల్లోజి మల్లారెడ్డి భార్యకు ఇటీవల అనారోగ్యం కారణంగా కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొందడం జరిగింది రాష్ట్ర ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు సహకారంతో ఆమెకు హాస్పటల్ కు సంబంధించిన ట్రీట్మెంట్ పూర్తిగా చేయించడం జరిగిందని తెలిపారు. వారి కుటుంబం కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పనులకు వెళ్లకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐన్టియుసి నాయకులు పరమంకుశం శ్రీనివాస చారి దృష్టికి తీసుకురాగా వారు అమ్మ ఫౌండేషన్ శ్రీజని సంప్రదించి మల్లారెడ్డి కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు ఇప్పించడం జరిగింది. అందుకుగాను ఆ కుటుంబసభ్యులు అమ్మ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి,లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోలుమూరి శ్రీనివాస్,కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గాండ్ల మోహన్, ముడత శంకర్, పాక్స్ మాజీ డైరెక్టర్ ఆసం తిరుపతి తదితరులు పాల్గొన్నారు