Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) టిపిటిఎఫ్,సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో టిపిటిఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కందుకూరి రమణ, సంస్కరణ సభ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ఉపాధ్యాయ భవన్లో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చిట్యాల విజయేందర్ రెడ్డి, అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు తిరుపతి రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి దామర రాజయ్య, హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి, రాజయ్య, మాట్లాడుతూ ఫెడరేషన్ ఆశయ సాధన కోసం సామాజిక సమస్యలు పరిష్కారం కోసం ఫెడరేషన్ విస్తరణ కోసం కామ్రేడ్ కందుకూరు రమణ, ఎంతో కృషి చేశారని అన్నారు.ఓకే భావజాలంతో పనిచేసే సంఘాల ఐక్యత కోసం కృషిచేసి విజయం సాధించారని ఆయన సేవలను కొనియాడారు రమణా, పూర్వ కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో ఫెడరేషన్ విస్తరణ కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్, రాష్ట్ర కౌన్సిలర్లు రాజులు, జమీర్, రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహా రెడ్డి, ర్యాకం మల్లేశం, అజీజ్, ప్రభాకర్, జిల్లా కార్యదర్శులు సత్యనారాయణ, శివాజీ, సత్యక్రిష్ణ, శ్రీనివాస్, రాములు, మండలాల బాధ్యులు సుధాకర్ రెడ్డి, కనకయ్య,ఎల్లం, రాజేందర్, రాజు సీనియర్ నాయకులు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.