


సబ్ టైటిల్; జనం న్యూస్ ఎప్రిల్ 25 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని రైతు వేదిక లోభూ భారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్ మాట్లాడుతూ భుముల సమస్యలకు భూ భారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యా ప్రసాద్ అన్నారు శుక్రవారం మండల కేంద్రము లో గల రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రైతులకు ధరణి చట్టం కంటే మెరగైన సేవలు పొందేల ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు భూములకు సంబంధించిన ప్రతి సమస్యలను భూ భారతి చట్టం ద్వారా పరిష్కరించుకోవ్చని పేర్కొన్నారు ప్రతి కమతానికి భూదార్ కార్డును కేటాయించి ముద్దులతో కుడీన మ్యాప్ ను పొందుపరచాను న్నట్లు తెలిపారు ధరణి తో రైతులకు నష్టం జరిగిందని ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు భూ మ్యాప్ ద్వారా భూ యజమానుల హక్కులు భద్రంగా ఉంటాయి అని అన్నారు రైతుల పాక్షపాతి ముఖ్యమంత్రి రేవంతురెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తున్నారని తెలిపారు అనంతరం మండలానికి చెందిన 20, మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయల విలువగల చెక్కులను 7 గురు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 7 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జిల్లా మెంబర్ ముప్పాళ్ల రాంచందర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ చైర్మన్ నవిన్ రావు తహసిల్దార్ ముంతాజిబుద్దిన్ మండల అభివృద్ధి అధికారి లచ్చులు అర్ ఐ రాహుల్ శ్రీనివాస్ మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు