Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 25. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని. బి.వి.ఆర్ ఐటి విష్ణు పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా. అడిషనల్ ఎస్పీ ఎస్. మహేందర్ మెదక్ జిల్లా. విష్ణు కళాశాల చైర్మన్ కె.వి విష్ణు రాజు. వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్. సెక్రటరీ కె. ఆదిత్య విస్సం. పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ. ఎస్ మహేందర్. మాట్లాడుతూ. మార్కులే ప్రధానం కాదని. విద్యార్థులకు మంచిపట్టుదల నాలెడ్జ్ శక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చునని అన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఎవరు కూడా ఆత్మహత్యల వైపు ప్రయాణించకూడదని మరో ధైర్యంతో ముందుకెళ్లాలని. విద్యార్థులకు సూచించారు. బి.వి.ఆర్.ఐ.టి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే మాట్లాడుతూ. ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు ఎలాంటి విద్యను అందించడం జరుగుతుందో అలాగే కె.వి విష్ణు రాజు సలహా సూచనల మేరకు విష్ణు పాఠశాలలో కూడా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను నియమించి సీబీఎస్సి. సిలబస్ తోపాటు విద్యార్థులకు అన్ని విధాల వసతులు కల్పిస్తూ అద్భుతమైన విద్యను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. విష్ణు పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్. జామి మాట్లాడుతూ. ఇప్పటివరకు విష్ణు పాఠశాలలో స్టేట్ సిలబస్ ఉండేదని.ఈ సంవత్సరం నుండి సీబీఎస్సీ సిలబస్ గా మార్చడం జరిగిందని తెలిపారు. ఈవార్షికోత్సవ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు తమతమ ఆటపాటలతో అలరించారు.ఈ కార్యక్రమంలో బివిఆర్ఐటి కళాశాల ప్రిన్సిపల్. డాక్టర్ సంజయ్ దుబే. వైపర్ ఫార్మసి కళాశాల ప్రిన్సిపల్. డాక్టర్ ఏ. రమేష్ . విష్ణు పాఠశాల ప్రిన్సిపల్. డాక్టర్ జామి. డైరెక్టర్ అశోక్ రెడ్డి. బాపిరాజు.డాక్టర్ సురేష్ కుమార్.వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు.విద్యార్థులు. తదితరులు పాల్గొన్నారు.