Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రి పరిసరాలు, గదులు, హాస్పిటల్ లో ఉన్న ల్యాబ్ ను,ఓ పి రిజిస్టర్, ను పరిశీలించి ,ప్రతి రోజు ఎంతమంది పేషెంట్లు ఆస్పత్రికి వస్తున్నారని సంబంధిత మెడికల్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు.హాస్పటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు.ఆసుపత్రికి ప్రతిరోజు రోగులు ఎంతమంది వస్తున్నారు. ఇన్ పేషంట్స్ వారి గురించి వాకబు చేశారు. తదుపరి ఫార్మసీ స్టోర్ ఇన్ స్పెక్షన్ చేయడం జరిగింది.అత్యవసర మందుల నిల్వలు సరిగా మైంటైన్ చేయాలని, అలాగే కుక్క కాటు, పాము కాటు, మందులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఫార్మసిస్ట్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోదాడ ఆర్డివో సూర్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి శిరీష, తహసిల్దార్ ఆంజనేయులు, డాక్టర్ రవీందర్, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.