Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.

జనం న్యూస్ 26 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : విజయనగరం జిల్లా పోలీసు శాఖలో నేర నియంత్రణ, చేధనలో విశేషంగా పని చేస్తున్న పోలీసు డాగ్స్ విశ్రాంతి తీసుకొనేందుకు నిర్మాణంలో ఉన్న డాగ్ కెన్నెల్స్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఏప్రిల్ 25న తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – జిల్లా పోలీసుశాఖలో నేర నియంత్రణ, చేధనలోపోలీసు డాగ్స్ పాత్ర చాలా కీలకమని, వాటికి సరైన విశ్రాంతిని ఇచ్చి, తిరిగి వాటి సేవలను వినియోగించుటకు వాటి సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమం ఉందన్నారు. పోలీసు డాగ్స్ విశ్రాంతి తీసుకొనేందుకు ప్రత్యేకంగా శాశ్వతమైన కెన్నెల్స్ లేకపోవడంతో ఎఆర్ పోలీసు లైన్స్ లోని పాత పోలీసు క్వార్టర్సును తాత్కాలిక కెన్నెల్స్వినియోగిస్తున్నామన్నారు. ప్రస్తుతం పోలీసు డాగ్స్ విశ్రాంతి తీసుకొనేందుకు ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పోలీసు డాగ్స్ కొరకు ప్రత్యేకంగా కెన్నెల్స్ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా ఎఆర్ పోలీసు లైన్స్లో గతంలో నిర్మించి, సగంలో నిలిచిపోయిన డాగ్ కెన్నెల్స్ ను జిల్లా ఎస్పీ సందర్శించి, నిర్మాణ పనులను
పరిశీలించారు. కొన్ని అనివార్య కారణాలు వలన గతంలో నిర్మించి, సగంలో నిలిచిపోయిన కెన్నెల్స్ నిర్మాణం పూర్తి చేసి, డాగ్స్ విశ్రాంతి తీసుకొనేందుకు ప్రత్యేకంగా శాశ్వత కెన్నెల్స్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు.ఇందులో భాగంగా నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రతిపాదనలను పంపాలని సెక్యూరిటీ ఆర్ఐని జిల్లా ఎస్పీ ఆదేశించారు.భవిష్యత్తు అవసరాలు దృష్ట్యా జిల్లాకు స్నివఫర్, ట్రాకింగు, నార్కోటిక్ డాగ్స్ అదనంగా వచ్చే అవకాశం ఉన్నందున డాగ్ కెన్నెల్స్ నిర్మాణం, ఆఫీసు రూం, డాగ్స్కు ఫుడ్ ప్రిపేర్ చేసేందుకు ప్రత్యేకంగా కిచెన్ ఉండే విధంగా ప్రతిపాదనలుసిద్ధం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, సెక్యూరిటీ రిజర్వు ఇన్స్పెక్టరు టి.శ్రీనివాసరావు, ఇతర పోలీసుఅధికారులు, డాగ్ హ్యాండలర్స్ ఉన్నారు.