

జనం న్యూస్ 26 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : జమ్ము కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిని భారతీయ శ్రామిక సంఘం నాయకులు ఖండించారు.ఈ సందర్బంగా BMS జిల్లా అధ్యక్షుడు నల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో విజయనగరంలోని కోట వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి, కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పర్యాటక ప్రాంతాల అందాలను చూసేందుకు వెళ్లిన హిందువులపై దాడి పిరికిపంద చర్యగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గ్‌న్నారు.