Listen to this article

భారతి చట్టం 2025 అవగాహన సదస్సు.

జనం న్యూస్, ఏప్రియల్ 27, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని, రైతు వేదికలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్, వల్లూరు క్రాంతి, భూ భారతి చట్టం 2025 పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ, భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకతకు, ధరణి స్థానంలో భూభారతి 2025 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని, ఈ భూ భారతి చట్టం ద్వారా, రైతులకు సులభతరమైన, న్యాయమైన సేవలు అందుతాయని అన్నారు. ఈ చట్టంలో ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన వారికి, ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని, తమ భూములకు సంబంధించిన సమస్యలను, దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉన్నదని, భూ భారతీయ చట్టం ద్వారా, నిషేధిత భూములు, సాదా బైనమాల క్రమబద్ధీకరణ, సర్వే నెంబర్లలో పొరపాట్లు, పేర్లు మార్పు సవరణలు వంటి అపరిస్కృత సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తేవాలన్నారు.తహసిల్దార్ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఆర్డీవోకు అక్కడ పరిష్కారం కాకపోతే కలెక్టర్ కు ఆప్పీల్ చేసుకుని అవకాశం ఉందన్నారు. నిర్ణీత కాలపరిమితిలో, భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కోహిర్, న్యాల్కల్ మండలాలలోనూ భూభారతి 2025 అవగాహన సదస్సులు నిర్వహించగా, కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అనంతరం ఇందిరమ్మ ఇంళ్ల లబ్ధిదారులకు, చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డిఓ రామ్ రెడ్డి, తహసిల్దార్ తిరుమలరావు పాల్గొన్నారు.