Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 26 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అధికారులకు ఆదేశించారు. అధికారులు పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహించాలన్నారు. అనంతరం బిచ్కుంద మండల కేంద్రంలో కే. జయశ్రీ ఇంటిని ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ రోజు కూలి పని చేసి ఇంటిని, పిల్లలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరారు. ప్రస్తుతం రేకుల షెడ్ లో నివసిస్తున్నామని, తమకున్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటామన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇల్లు నిర్మించుకుంటామాన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోపాలకృష్ణ, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.