Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
రజదోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి నందం, మాజీ ఎంపీటీసీ గడిపే విజయ్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ ధైనంపల్లి సుమన్ పిలుపునిచ్చారు. గండ్ర దంపతుల ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గాదె రాజేందర్ ఆధ్వర్యంలో రజతోత్సవ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎలుకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే రజతోత్సవ బహిరంగ సభకు ప్రజలు, యువతి యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ధైనంపల్లి కరుణ్ బాబు, రంగు మహేందర్, ధైనంపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు….