Listen to this article

భారత పౌరుల జోలికొస్తే ఊరుకోం….

జనం న్యూస్ ఏప్రిల్ 26 భీమవరం మండల ప్రతినిధి కాసిపేట రవి : భీమారం మండల కేంద్రలోని శుక్రవారం రోజున అన్ని ప్రజాసంఘాలు నాయకులు, మాట్లాడుతూ భారత పౌరుల జోలికొస్తే ఊరుకునేది లేదని కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అమాయకులైన పౌరులపై ఉగ్రవాదులు దాడి చేయడం సిగ్గుచేటని , ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొంతమంది ఇస్లాంకు చెడు పేరు తేవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. భారతదేశం సమైక్యతకు నిదర్శనం భారతదేశo, సమైక్యతను దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క భారత పౌరుడు ఈ దాడికి ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు , యువకులు తదితరులు పాల్గొన్నారు.