

జనం న్యూస్ ఏప్రిల్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల యొక్క ఎత్తు మరియు బరువులు తీసి వారి ఆరోగ్య స్థితిని అంచనా వేసి ,సామ్, మామ్ పిల్లలను గుర్తించి నివేదికలు సమర్పించాలని అంగన్వాడీ టీచర్స్లకు శనివారం బంబారా గ్రామంలోని రైతువేదికలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి Dr.ఆడేపు.భాస్కర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో సామ్, మామ్ ద్వారా బలహీన చిన్నారులను గుర్తించి , వారికి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్య స్థితిని మెరుగు పరిచి,ప్రతి రోజు ఆన్లైన్ లో పోషణ ట్రాకర్‌లో వివరాలను విధిగా నమోదు చేయాలని ,అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు.పిల్లలలో 0-6 సంవత్సరాలు యొక్క ఎత్తు,బరువులు సరిగ్గా తీసి వారిలో పోషణ లోపంతో బాధపడుతున్న పిల్లల్ని గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అందించే పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగు పర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోషన్ అభియాన్ కో ఆర్డినేటర్ గోపాల క్రిష్ణా, ఐసిడిఎస్ సూపర్ వైజర్లు భారతి,కుమారి,లత, పోషణ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ తౌఫీక్,జిల్లా బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్ డోoగ్రి. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు