

జనం న్యూస్ ఏప్రిల్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని గట్లకానిపర్తి గ్రామం చెందిన వలగుల సంతోష్ బాబు తండ్రి కొమురయ్య అను అతను తన గ్రామంలోని పెళ్లికి హాజరై, తన సెల్ ఫోనును తన బండి పౌచ్ పెట్టి, శుభకార్యం లో అన్నం వడ్డించడం అయిపోయిన తర్వాత తన బండి వద్దకు వెళ్లి బండి పౌచులో చూడగా తన సెల్ ఫోను కనబడలేదని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన సెల్ ఫోను దొంగిలించుకొని, పోయినాడని, సెల్ ఫోన్ పే ద్వారా తన అకౌంట్లోని 19420/- రూపాయలను కాజేసినాడని, పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా ఎస్సై జక్కుల పరమేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు తెలియజేశారు.