

జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )
కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల శాఖ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో మేనేని సత్యనారాయణ రావు వర్ధంతి కార్యక్రమాన్ని మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెస్సార్ ,చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి సేవలను స్మరించుకోడం జరిగింది. ఇ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెస్సార్ తన రాజకీయ జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించారని, నీతి నిజాయితీతో ప్రజల మన్ననలు పొందిన గొప్ప నాయకుడని కొనియాడారు.
రెండుసార్లు ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈప్రాంత ప్రజలకు సేవలందించారన్నారు.ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా సేవలందించారని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కీ విశేష సేవలందించారఅని తెలిపారు.రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్ గా,పీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 లో పార్టీ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించిన గొప్ప నాయకుడు అని,ఆయన చేసిన సేవలు మరువలేనివి మరియు నేటి తరానికి ఆయన అందించిన సేవలు ఆదర్శప్రాయమని గుర్తు చేశారు.
1969 తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ కోసం కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడని, తెలంగాణ ప్రజా సమితి నుంచి 1971 లో కరీంనగర్ ఎంపీ గా విజయం సాధించి తెలంగాణ వాణిని వినిపించారన్నారు. గొప్ప నాయకుని, అతని జీవిత ప్రయాణం, రాజకీయ ప్రస్థానం, నీతి నిజాయితీ తో అనేక బాధ్యతలకు, తను చేసిన పదవులను వన్నె తెచ్చి న చరిత్ర ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గూడెపు సారంగపాణి, ఉప్పల శ్రీనివాస్ రెడ్డి, కనుమల్ల రామకృష్ణ, కనుమల్ల సంపత్, గంగారపు మహేష్, కారింగుల రాజేందర్, అన్నం ప్రవీణ్, వంగ రామకృష్ణ, బుర్ర రమేష్, మీస రాజయ్య, ఎండీ అజ్గర్ పాషా, మిట్ట మోహన్ రావ్, గురుకుంట్ల స్వామి, మూడెత్తుల మల్లేష్, బైరెడ్డి కొండారెడ్డి, బండి మల్లయ్య, తెడ్ల బీరయ్య, భోగం సాయిరా, కురిమిండ్ల చిరంజీవి, సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, గూడెపు ఓదేలు, ఆరే రమేష్ రెడ్డి, జక్కు కుమారస్వామి, గుండారపు సాయి, మారపల్లి వంశీ, గొట్టె రాజశేఖర్, భోగం చిరంజీవి, పుట్ట రాజు, మూడెడ్ల రమేష్, మోత్కూరి శ్రీనివాస్, ఎండి గఫూర్, ఉప్పల మల్లారెడ్డి, కె మణి, ముద్రబోయిన స్వామి, తదితరులు పాల్గొన్నారు.