

జనం న్యూస్ 27ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.
సిర్పూర్ (యు) :పోలీసులు మీకోసం కార్యక్రమం లో భాగంగా బోర్వేల్ వేసి మంచినీటి సమస్య ను పరిష్కరించిన పోలీసులు. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గ్రామంలో ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ కు సమాచారం అందించినట్లు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశానుసారం అడిషనల్ ఎస్పీ చిత్తరంజన్ పర్యవేక్షణ లో పోలీసులు మీకోసం కార్యక్రమం లో భాగంగా బోర్వెల్ వేయించడం. జరిగిందన్నారు. పోలీసులు అంటే చట్టాల రక్షణ, ప్రజాసంరక్షణ మరియు వారి అవసరాలు తీర్చేందుకు సామాజిక కార్యక్రమాల వంటివి నిర్వహించడం జరుగుతుందని ఎస్ ఐ అన్నారు. మంచినీటి సమస్యను పరిష్కరించి నందుకు గ్రామ స్తులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.