

జనం న్యూస్ జనవరి 17 కాట్రేనికొన
అమలాపురం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీ ఎన్జీవో జిల్లా చైర్మన్ అరిగెల వెంకట రామారావు, జిల్లా కార్పెంటర్ అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణమూర్తి మరియు రోడ్ సేఫ్టీఎన్ జి ఓ సభ్యులు చే జిల్లాకలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ చేతుల మీదుగా రోడ్ సేఫ్టీ ఎన్జీవో, రోడ్డు ప్రమాదాలు వాటి నివారణ కరపత్రాలను ఆవిష్కరించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు సందేశం, ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం “రోడ్డు ప్రమాదాలు -వాటి నివారణ” అని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది, ముఖ్యంగా మధ్య వయస్కులు గురి అవుతున్నారని, దీని ప్రభావం రాష్ట్ర మరియు దేశాభివృద్ధి పడుతుందని, భారత ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ప్రైవేట్ ప్రవేశ పెట్టినదని, 24 గంటల్లో ప్రమాదాన్ని గుర్తించి తెలియజేసిన వారికి 1,50,000 లక్షల తక్షణ సహాయం అందజేత, హిట్ అండ్ రన్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రెండు లక్షల రూపాయల నగదు పథకాన్ని ప్రవేశపెట్టినదని, l రోడ్ సేఫ్టీ గురించి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, ఈ రోడ్ సేఫ్టీ గురించి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బద్రి సత్యనారాయణ, అరిగెల లక్ష్మణ్,గున్నేపల్లి భీమశంకరo, ఆకుల నాగేశ్వరరావు, అరిగెల మధు, కొనుకు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.