

జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని బొడ్రాయి వద్ద ఉన్న గ్రంథాలయాన్ని ఆదివారం రోజున అజీజ్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠకులకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలను దినపత్రికలను వచి వెళ్లి పాఠకుల సంతకాలను రిజిస్టర్ ను పరిశీలించారు చైర్మన్ తనిఖీ సమయంలో గ్రంథాలయ కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు విధులకు సక్రమంగా హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్న లైబ్రేరియన్ సుధాకర్ హాజరు విషయం పై సిబ్బందితో పాటు స్థానికులను అడిగి తెలుసుకున్నారు సరిగా విధులకు హాజరు కావడం లేదని అభిప్రాయాలు రావడంతో శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు గ్రంథాలయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన వెంట జూనియర్ అసిస్టెంట్ సంతోష్ సిబ్బంది రాజు ఉన్నారు….