

జనం న్యూస్ 28 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పహల్లాం ఉగ్రవాదుల చర్యకు నిరసనంగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం నుంచి ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవర ఈశ్వరరావు మాట్లాడుతూ…కాశ్మీర్ అభివృద్ధి చూడలేక ఉగ్రవాదులు మాయకులైనటువంటి పర్యాటకులను హతమార్చడం బాధాకరమన్నారు. మాజీ సైనికులు ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సైనిక పెద్దలు పాల్గ్‌న్నారు.