

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన జాతీయ మాస్టర్స్ గేమ్స్, అథ్లెటిక్స్ పోటీలను హైమర్ త్రో 35+ విభాగంలో అత్యంత ప్రతిభను కనబరిచి కాంస్య పథకాన్ని గెలుపొందగా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామస్తులు శనివారం సాయంత్రం గ్రామపంచాయతీ ఆవరణంలో అభినందన సభను ఏర్పాటు చేశారు, అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పాల్గొని రఘుని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రఘు నిరుపేద కుటుంబంలో పుట్టి, ఉన్నత చదువులు అభ్యసించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికై జీవనం కొనసాగిస్తున్న తరుణంలో ఇటీవల మాస్టర్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీలలో జాతీయస్థాయిలో అత్యంత ప్రతిభను కనబరిచి పథకం సాధించడం చెల్పూర్ గ్రామానికి కాకుండా ఈ రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు,సింగపూర్ లో జరిగే అంతర్జాతీయ పోటీలలో పాల్గొని పథకాలు సాధించాలని కోరారు.నేటి సమాజంలో యువకులందరూ మందుకు, మత్తు, పానీయాలకు డ్రగ్స్ కు, గంజాయికి, అలవాటు పడుతున్న తరుణంలో రఘు క్రీడల్లో పథకాలు సాధించడం గర్వకారణమని తెలుపారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని యువకులకు పిలుపునిచ్చారు.యువకులు వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా తల్లిదండ్రుల కలలు కన్నా కళలను సహకారం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జయ భారతి విద్యాసంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి, అంతర్జాతీయ క్రీడాకారులు అంబాల ప్రభాకర్ ప్రభు, వంతడుపుల బాబు, జైపాల్ రెడ్డి, వేల్పుల రత్నం,జకర్యా, సాయిబాబా, పంజాల కృష్ణమూర్తి, కోడిగుటి ప్రవీణ్, సదానందం,సమ్మెట సంపత్, మొలంగూరి ప్రభాకర్, దయాకర్,గన్ను అశోక్, రామ్ రాజలింగం,రాజేశ్వర్, శనిగరం రవి, ఆకునూరి రవీందర్, వంతడుపుల రమేష్,నరసయ్య తదితరులు పాల్గొన్నారు.