Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,

జనం న్యూస్ 28 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

దేశంలో ఉగ్రవాదులు కాశ్మీర్ రాష్ట్రం పహల్గాం ప్రాంతంలో దాడులకు తెగబడి, భారతీయులపై కాల్పులకు
పాల్పడడంతో రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాలతో అప్రమత్తమై, జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో ఆకస్మికంగా వాహన తనిఖీలు, లాడ్జిలు, హెూటల్స్, పబ్లిక్ ప్రాంతాల్లోను తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఏప్రిల్ 27న తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో దాడులకు తెగబడిన నేపథ్యంలో రాష్ట్ర డిజిపి గారి ఆదేశాలతో అప్రమత్తమై, జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా వాహనాలు, లాడ్జిలు, హెూటల్స్, పబ్లిక్ ప్రాంతాలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లులో తనిఖీలు చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 26న ఏక కాలంలో తనిఖీలు ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, ప్రధాన జంక్షన్లు వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి, అనుమానితుల బ్యాగులను తనిఖీ చేసామన్నారు. పోలీసుశాఖకు చెందిన స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిస్పోజల్ బృందాలు ముఖ్య కూడళ్ళు, రైల్వే స్టేషన్లు, బస్టాండుల వద్ద బాంబ్లను గుర్తించే ప్రత్యేకమైన ఇక్విప్మెంట్ తో తనిఖీలు చేపట్టారు. జిల్లాలోకి ప్రవేశించి ప్రధాన మార్గాలు, సరిహద్దు జిల్లాలకు వెళ్ళే ముగింపు ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల వద్ద పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టి, 615 వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసారు. అదేవిధంగా అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు లాడ్జిలు, హెూటల్స్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి, బస చేసే వ్యక్తులు ఎందుకు వచ్చింది, ఏ పని మీద వచ్చింది తెలుసుకొని, వారి గుర్తింపు కార్డులను పరిశీలించి, అనుమానితుల వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ డివైజ్లతో తనిఖీ చేసి, వారి నేరచరిత్రను పరిశీలించారు. తనిఖీల్లో 13మంది వ్యక్తులు ఇతర ప్రాంతాల నుండి వివిధ పనుల మీద జిల్లాకు వచ్చి, లాడ్జిల్లో బస చేస్తున్నట్లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17 ప్రాంతాల్లో ఏంటి సేబిటేజ్ తనికీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ ఆకస్మిక తనిఖీలను విజయనగరం డిఎస్సీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించగా, సంబంధిత సిఐలు, ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ బృందాలు, బి.డి.టీం బృందాలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తనిఖీల నిర్వహణలో పాల్గొన్నారు.