

జనం న్యూస్. జనవరి 17. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి సర్వే పారదర్శకంగ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
అధికారులకు సూచించారు. శుక్రవారం హత్నూర మండలంలోని గుండ్ల మాచూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల సర్వేలో ఆయన పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా జాబితాలో పేర్కొన్న వివిధ పథకాలను లబ్ధిదారుల ఇంటి వద్దనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో సర్వేచేసి అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల ఎంపిక ప్రభుత్వ నిబంధనలనకు లోబడి పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.వారి వెంట తాహసిల్దార్ ఫర్హిన్ షేక్, ఎంపీడీవో శంకర్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు,ఎంపీవో యూసుఫ్,ఆర్ ఐ శ్రీనివాస్, సర్వాయర్ శ్రీనివాస్, నాయకులు శశిధర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.