Listen to this article

జనం న్యూస్ 28ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.

జైనూర్ : కెరమెరి మండలం జోడేఘాట్ ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సిఆర్టి గా పనిచేస్తున్న కనక కాశీరాం ఇటీవల వడదెబ్బతో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.కాశీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందేలా చూస్తానని భరోసానిచ్చారు.సుగుణక్క వెంట జైనూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖిద్, నాయకులు గంగారాం, హైదర్, సిద్దు, గణపత్,అన్నారవ్, ధర్ము, కనక ప్రతిభ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.