

జనం న్యూస్ ఏప్రిల్ 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని
తాళ్ల రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000 -2001 సంవత్సరంలో పదవతరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం రోజునా రాజతోత్సవం పూర్తి అయిన సందర్బంగా సొసైటీ ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులువివిధ స్థాయిలో, విదేశాల్లో ఉన్నప్పటికీ అందరూ హాజరు కావడం ఒకరినొకరు పలుకరించుకొని చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకొని అందరూ ఆనందంగా గడిపారు. విద్యార్థులకు విద్యాబోధనలు అందించిన ఉపాధ్యాయులు మనోహర్,ధర్మేందర్ మరియు నాగేందర్లను ఘనంగా సన్మానించారు.పూర్వవిద్యార్థులు గుడ్ల సంతోష్ కుమార్,గడ్డం మోహన్ రెడ్డి, తిరుపతి, బెజ్జరాం శ్రీనివాస్, ఏర్గట్ల మహేందర్, బైండ్ల గంగారాం, ఆడెపు రంజిత్,మగ్గిడి నరేష్ గడ్డం రాములు మిగతా విద్యార్థులు పాల్గొన్నారు.