

జనం న్యూస్ ఏప్రిల్ 28 కాట్రేనికోన
కాట్రేనికోన మండల పరిధిలోని నడవపల్లిలో ఉన్న శ్రీనడవ పల్లమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు పది రోజులపాటు జాతరలు నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈరోజు గ్రామ దేవత నడవపల్లి అమ్మవారిని దర్శించుకున్న భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ , కాట్రేనికోన మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకి తరలివస్తుంటారు.మూడు రోజులు పాటు తీర్ధ మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి