Listen to this article

జనం న్యూస్ :28 ఏప్రిల్ సోమవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జ్ వై. రమేష్:

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, శ్రీ హరే రామ హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని యోగ మాస్టర్ పెద్ది మనోహర్ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఉదయం 8:30 గంటలకు కెసిఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ బస్తి దవఖాన ముందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమo ప్రారంభోత్సవానికి రెండో వార్డు కౌన్సిలర్ నాయిని చంద్రం ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేశం, మచ్చేందర్ శివ, శ్రీనివాస్, కారం కంటి సాయి, బూరుగు సప్న, శ్రీకాంత్, పెద్ది రేవంత్, రేణు శ్రీ, మమత, సురేష్ తదితరులు పాల్గొని తమ వంతు సహకారం అందించారు. హనుమాన్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.
అంబలి పంపిణీ ద్వారా ప్రజలకు మేలు చేయాలని నిర్వాహకులు తెలిపారు.