

జనం న్యూస్:28 ఏప్రిల్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
కథలు చెప్పి, నీతిని పంచడం మూలంగా మంచి ఆలోచనలకు స్థానం లభిస్తుందని, కథలు చెప్పడం ఒక కళ అని కథాశిల్పి ఐతా చంద్రయ్య అన్నారు. జాతీయ కథల దినోత్సవం ఏప్రిల్ 27సందర్బంగా సిద్దిపేటలో జరిగిన సమావేశంలో 320 బడులలో, కార్యశాలలు, సమావేశాలలో కథలు చెప్పి, విద్యార్థులను మంచివైపు నడిచేలా బాటలు వేస్తున్న కథల తాతయ్య ఎన్నవెళ్ళి రాజమోళికి సత్కారం చేశారు. ఈ సందర్బంగా బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ బాలలకు కథలు చేరువయ్యేలా, వేసవి సెలవులలో బాలలకు కథలు వినిపించాలన్నారు. సన్మాన గ్రహిత ఎన్నవెళ్ళి రాజమౌళి మాట్లాడుతూ పిల్లల ప్రపంచంలో కథలు చెప్పడం సంతోషమనిపిస్తుందన్నారు. బాలల వికాసానికి కథలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో కవులు సింగీతం నరసింహరావు, బస్వ రాజ్ కుమార్, కోణం పర్శరాములు, ఉండ్రాళ్ళ తిరుపతి తదితరులు పాల్గొన్నారు